ఈ రోజుల్లో అన్ని పోటీ పరీక్షలకు ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు.తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఏడాది నుంచి పోటీపరిక్షలను ఆన్లైన్ లో నిర్వహించడానికి సన్నాద్దాలు చేస్తున్నారు. అయితే ఆన్లైన్ లో పరీక్షలను గురించి విద్యార్థుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి...
👉ఆన్లైన్ పరీక్షల గురించి....
పరీక్ష హాలులోకి ప్రవేశించగానే మన యొక్క హాజరు వివరాలను బయోమెట్రిక్ ద్వారా నమోదు చేసుకోవటం జరుగుతుంది.ప్రతీ అభ్యర్థికి ఒక కంప్యూటర్ ని కేటాయిస్తారు.అభ్యర్థి యొక్క వివరాలు కంప్యూటర్ లో నమోదు చేయబడి ఉంటాయి, అభ్యర్థులు తమ వివరాలు సరిగ్గా ఉన్నాయో?లేవో? సరిచూసుకోవాలి.ఒకవేళ వివరాలు సరిగ్గా లేనిచో వెంటనే ఇన్విజిలేటర్ కి తెలపాలి. ఇన్విజిలేటర్ సూచించిన సమయానికి యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ లను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.లాగిన్ అయిన వెంటనే మనకు కొన్ని సూచనలు ఇవ్వటం జరుగుతుంది వాటిని క్షుణ్ణంగా చదవాలి.నిర్ణిత సమయానికి పరీక్ష ప్రారంభమౌతుంది.నిర్ణిత సమయానికి పరీక్ష ముగుస్తుంది.ఇదంతా ప్రత్యేకంగా రూపొందించిన ఒక సాఫ్ట్వేర్ ద్వారా నిర్వహించటం జరుగుతుంది.(ఇక్కడ ఎక్కువగా వివరించదలచుకోలేదు.నమూనా వీడియోని లింక్ ని అందస్తున్నాం వీక్షించండి.)
👉ఆన్లైన్ లో పరీక్షలు నిర్వహించటం అభ్యర్థి కి లాభమా?నష్టమా?
లాభాలు:
1)సాదరణంగా OMR Sheet పరీక్షలో గల ఐచ్చికాంశాలలో సరైనదాన్ని గుర్తించి ,ఆ గడిని పూరించాల్సి ఉంటుంది.దినికిగాను అభ్యర్థికి సగటున ౩-5సెకన్ల సమయం వేచించాల్సి ఉంటుంది.ఆన్లైన్ పరిక్ష వల్ల కేవలం 1-2సెకన్ల సమయంలోనే సమాధానాన్ని ఇవ్వవచ్చు.ఇక్కడ ప్రధానంగా అభ్యర్థికి సమయం ఆదా అవుతుంది.
2)OMR షీట్ లో ఒకసారి సమాధానాన్ని గుర్తించాక మరల మార్చుటకు వీలు ఉండదు.కానీ ఆన్లైన్ లో మార్చవచ్చును.
౩)పోటి పరీక్షల్లో అభ్యర్థి అనేక కారణాల వల్ల ఆందోళనకు గురి అవుతాడు.సాధారంగా అభ్యర్థికి ఇచ్చే ప్రశ్నాపత్రంలో ఒక పేజిలో కనీసం 5 ప్రశ్నలు ఉంటాయి.దిని వల్ల అభ్యర్థి ఒక ప్రశ్న చదివే సమయంలో ప్రశ్నను చూడబోయి సమాధానాన్ని గుర్తించటంలో తన ఏకాగ్రతను కోల్పోవటం జరుగుతుంది.అయితే ఆన్లైన్ ద్వారా నిర్వహించబడే పరీక్షల్లో అభ్యర్థికి ఒకసారి కేవలం ఒకే ప్రశ్న కనిపించటం వల్ల ఆ ప్రశ్నపై పూర్తి ఏకాగ్రతతో అలోచించి సమాధానం ఇవ్వగలుగుతాడు.
4)అభ్యర్థి తనకు తెలిసిగాని తెలియక గాని OMR షీట్ పై క్రమసంఖ్య తప్పుగా వేయటం,షీట్ పై ఇంకు గాని,నీరు గాని పడటం,షీట్ ని ఫోల్డ్ చేయటం వల్ల అభ్యర్థి పూర్తిగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంతాయి.కానీ ఆన్లైన్ పరిక్షల్లో ఇలాంటి సమస్యలు ఏమి ఉండవు.
5)ఆన్లైన్ పరిక్షల వల్ల అవకతకలు జరుగుటకు అవకాశాలు తక్కువ.
6)భద్రత తదితర విషయాల్లో ఆన్లైన్ పరిక్షలు ఉత్తమమైనవని నిపుణులు తెలుపుతున్నారు.
నష్టాలు:
1)అభ్యర్థులకి కంప్యూటర్ పరిజ్ఞానంపై కనీస అవగాహన లేకపోవటం.
2)కొన్ని సందర్భాల్లో కంప్యూటర్లు మొరాయించటం వల్ల అభ్యర్థి కంగారుపడవచ్చు.(ఇలా అతి తక్కువ సందర్భాల్లో జరుగుతుంది)
ఆన్లైన్ పరిక్షల వల్ల చిన్న చిన్న నకారాత్మక విషయాలు ఉన్నప్పటికీ అభ్యర్థులు కంప్యూటర్ పై కనీస అవగాహన పెంచుకోవటం,నమూనా పరిక్షలు రాయటం,పరిక్ష హాలులో ఏదైనా సందేహం వస్తే వెంటనే ఇన్విజిలేటర్ ని అడగటం.ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే వెంటనే అక్కడి సిబ్బంది తెలపటం ద్వారా పై నష్టాలను నివారించుకోవచ్చు.
ఆన్లైన్ పరిక్ష గురించిన వీడియో కోసం :Click Here
నమూనా ఆన్లైన్ పరీక్షను వ్రాయుటకు:Click Here
- గ్రంధాలయ విభాగం.

0 Comments