Ticker

6/recent/ticker-posts

ఇండియన్ రైల్వేలో 9739 ఖాళీలు...

భారతీయ రైల్వే వివిధ రైల్వే జోన్ల పరిధిలో ఖాళీగా ఉన్న ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్, సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు:
ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్- 8619 ఖాళీలు 
(పురుషులు-4403, మహిళలు-4216)

-అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి మెట్రిక్యులేషన్/ పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. 

ఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ-1120 ఖాళీలు 
(పురుషులు-819, మహిళలు-301)

-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. 

-వయస్సు: 2018 జూలై 1 నాటికి కానిస్టేబుల్ పోస్టులకు 18 నుంచి 25 ఏండ్ల మధ్య, ఎస్‌ఐ పోస్టలకు 20 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి.

-పే స్కేల్: కానిస్టేబుల్ పోస్టులకు రూ. 21,700/- ఎస్‌ఐ పోస్టులకు రూ. 35,400/- (7వ వేతన కమిషన్ ప్రకారం ఇతర సౌకర్యాలు ఉంటాయి)

-అప్లికేషన్ ఫీజు: రూ. 500/-, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, మహిళ, మైనార్టీస్, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు- రూ. 250/-. ఈ ఎగ్జామినేషన్ ఫీజును కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసిన జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ. 400/-, మిగతా అభ్యర్థులకు రూ. 250/- రిఫండ్ చేస్తారు.

-ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పీఈటీ, పీఎంటీ. ఈ మూడు పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు చివరగా డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసి తుది ఫలితాలను ప్రకటిస్తారు. 
-రాతపరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) సెప్టెంబర్/అక్టోబర్‌లో నిర్వహిస్తారు. ఈ పరీక్షలో 120 ప్రశ్నలు ఇస్తారు. 90 నిమిషాల్లో పూర్తిచేయాలి. దీనిలో జనరల్ అవేర్‌నెస్-50, అర్థమెటిక్స్-35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్-35 మార్కులు.
-పీఈటీ, పీఎంటీ పరీక్షకు ప్రకటించిన మొత్తం ఖాళీలకు 1: 10 నిష్పత్తిలో అనుమతిస్తారు.
-ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీతోపాటు ప్రాంతీయ భాషల్లో కూడా ఇసారు. 

-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో.

-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 30

-వెబ్‌సైట్: www.indianrailways.gov.in

Post a Comment

0 Comments