యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (హెచ్‌సీయూ) 2018-19 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ వీసీ పొదిలె అప్పారావు తెలిపారు.
మొత్తం 117 కోర్సుల్లో 1,945 సీట్ల కోసం అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 4న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ...ఏప్రిల్ 5 నుంచి మే 5వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మే 22 నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని, అభ్యర్థుల అడ్రస్ ప్రకారం దగ్గరగా ఉన్న పరీక్షా కేంద్రాలను కేటాయిస్తామన్నారు. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లోని 38 కేంద్రాల్లో జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఎంఫిల్, పీహెచ్డీ, కొన్ని పీజీ కోర్సులకు మౌఖిక పరీక్షల ద్వారా అడ్మిషన్లు చేపడతామన్నారు. ఈ ఏడాది కొన్ని కొత్త కోర్సులు ప్రవేశపెడుతుండగా.. అనివార్య కారణాల వల్ల కొన్ని కోర్సులను రద్దు చేసినట్లు వెల్లడించారు. సమావేశంలో వర్సిటీ వీసీ-1 బీపీ సంజయ్, వీసీ-2 ప్రొఫెసర్ ప్రకాశ్ బాబు, ఎగ్జామినేషన్ కంట్రోలర్ దేవేశ్ నిగామ్ తదితరులు పాల్గొన్నారు.
ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: 5 ఏప్రిల్-5 మే,2018.
పరీక్ష తేదీలు: 1 జూన్ నుంచి 5 జూన్ 2018.
అప్లై చేయుటకు :Click Here
0 Comments