Ticker

6/recent/ticker-posts

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ లో ఉద్యోగాలు...

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (ఐఏఎఫ్)లోని గ్రూప్ ఎక్స్, గ్రూప్ వై (నాన్ టెక్నికల్) ట్రేడ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎయిర్‌మెన్ పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి మాత్రమే దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 


  • ఇంటర్, డిప్లొమా అభ్యర్థులకు అవకాశం
  • రాతపరీక్ష, పీఎఫ్‌టీ ద్వారా ఎంపిక 
  • మంచి జీతభత్యాలు, ఆకర్షణీయమైన అలవెన్స్‌లు


వివరాలు:-
పోస్ట్ పేరు: ఎయిర్‌మెన్ (గ్రూప్ ఎక్స్, గ్రూప్ వై)

అర్హతలు: 
 1) గ్రూప్ ఎక్స్ (ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు కాకుండా)- గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్/10+2లో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఇంగ్లిష్‌లో తప్పనిసరిగా 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి లేదా తత్సమానకోర్సు లేదా మూడేండ్ల ఇంజినీరింగ్ డిప్లొమాలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. డిప్లొమా లేదా ఇంటర్/పదోతరగతి ఇంగ్లిష్‌లో 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి.ఉదోగ్యలు 

2) గ్రూప్ వై పోస్టు (ఆటోమొబైల్ టెక్నీషియన్, జీటీఐ, ఐఐఎఫ్ (పీ), ఐఏఎస్ (ఎస్), మ్యూజీషియన్ ట్రేడ్‌లు కాకుండా మిగిలిన ట్రేడ్‌లకు)- ఇంటర్ లేదా తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఇంగ్లిష్ సబ్జెక్టులో తప్పనిసరిగా 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. 

3) గ్రూప్ వై (మెడికల్ అసిస్టెంట్ ట్రేడ్) పోస్టులకు - కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్/10+2లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఉత్తీర్ణత. ఇంగ్లిష్‌లో తప్పనిసరిగా 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.

నోట్: డిప్లొమా అభ్యర్థులు కేవలం గ్రూప్ ఎక్స్ పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇతర ట్రేడ్‌లకు అర్హులుకారు. 

వయస్సు: 1998, జనవరి 13 నుంచి 2002, జనవరి 2 మధ్య జన్మించి ఉండాలి. గరిష్ఠంగా 21 ఏండ్లు మించరాదు.

శారీరక ప్రమాణాలు:

ఎత్తు- 152.5 సెం.మీ.

ఛాతీ- శరీరానికి తగిన అనుపాతంలో ఉండాలి. గాలిని పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచం చెందాలి.

బరువు- ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ పరీక్షల ద్వారా చేస్తారు. 

ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో.. 
6 నిమిషాల 30 సెకండ్లలో 1.6 కి.మీ. దూరం పరుగెత్తాలి.

10 పుష్ అప్‌లు, 10 సిట్ అప్‌లు, 20 స్కాట్స్.

ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లో క్వాలిఫై అయిన అభ్యర్థులను మాత్రమే మెడికల్ టెస్ట్‌కు అనుమతిస్తారు.

శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు జాయింట్ బేసిక్ ఫేజ్ ట్రెయినింగ్‌ను కర్ణాటకలోని బెల్గావిలో ఇస్తారు. శిక్షణ అనంతరం వారికి కేటాయించిన ట్రేడ్‌ల వారీగా ఉద్యోగం ఇస్తారు. మొదట 20 ఏండ్ల కాలానికి ఉద్యోగ నియామక పత్రాన్ని ఇస్తారు. దీన్ని 57 ఏండ్లు వయస్సు వచ్చే వరకు పొడిగించవచ్చు.

పే స్కేల్: శిక్షణ కాలంలో నెలకు రూ. 14,600, శిక్షణ పూర్తయిన తర్వాత గ్రూప్ ఎక్స్ పోస్టులకు నెలకు రూ. 33,100/-, గ్రూప్ వై పోస్టులకు రూ. 26,900/- అదనంగా ఉచిత వైద్య సౌకర్యం, రేషన్, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌లు తదితర వసతులు ఉంటాయి. 

పదోన్నతులు: ఎయిర్‌మెన్ నుంచి మాస్టర్ వారెంట్ ఆఫీసర్ వరకు పదోన్నతి పొందవచ్చు. ఇదేకాకుండా నిర్ణీత పరీక్షలు రాసి కమిషన్డ్ ఆఫీసర్ వరకు పదోన్నతి పొందవచ్చు.

నోట్: ఎయిర్‌మెన్ ట్రేడ్ శిక్షణ అనంతరం ఉన్నత చదువులు చదవడానికి అనుమతినిస్తారు. 

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో డిసెంబర్ 15 నుంచి ప్రారంభం.

ఫీజు: రూ. 250/- 

చివరితేదీ: 2018, జనవరి 12

వెబ్‌సైట్: Click Here

Post a Comment

0 Comments